జాతరకు వెళ్తుండగా ప్రమాదం: ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి

జాతరకు వెళ్తుండగా ప్రమాదం: ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి

జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎస్సారెస్పీ కెనాల్ లోకి కారు దూసుకెళ్లింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. మేడిపల్లి మండలం కట్లకుంట దగ్గర  సోమ‌వారం తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు ప్రమాదం జరిగింది.  జోగన్ పల్లికి చెందిన అమరేందర్ ఫ్యామిలీతో.. సొంత ఊళ్లో జరుగుతున్న వెంకటేశ్వరస్వామి జాతరకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో అమరేందర్ తో పాటు.. భార్య శిరీషా, కూతురు శ్రేయ నీటిలో మునిగి చనిపోయారు. కొడుకు జయంత్ సురక్షితంగా బయటపడ్డాడు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు క్రేన్ స‌హాయంతో కారును బ‌య‌ట‌కు లాగారు. అమ‌రేంద్ర‌రావుతో పాటు ఆయ‌న భార్య‌, కూతురు మృత‌దేహాల‌ను పోలీసులు బ‌య‌ట‌కు వెలికితీశారు.