
ఔటర్ రింగురోడ్డు పై మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి 2గంటలకు విజయవాడ నుండి గచ్చిబౌలి వెళుతున్న కారు.. అతివేగంగా నిద్రమత్తులో ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని శంషాబాద్ లోని ఆర్ హాస్పిటల్ కు తరలించారు ఔటర్ రింగ్ రోడ్ పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.