జూబ్లీహిల్స్ లో పల్టీలు కొట్టిన కారు.. డ్రైవర్ కు గాయాలు

జూబ్లీహిల్స్ లో పల్టీలు కొట్టిన కారు.. డ్రైవర్ కు గాయాలు

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బోల్తా పడింది. రోడ్ నంబర్ 45లోని గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదురుగా అతివేగంగా వచ్చిన కారు డివైడర్ ను ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. డివైడర్‌ను ఢీకొనడంతో కారు పల్టీలు కొడుతూ కొంతదూరం దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. కారు నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతనిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన సమయంలో కారులో డ్రైవర్ మాత్రమే ఉన్నాడని పోలీసులు తెలిపారు.