రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్( PVNR) ఎక్స్‌ప్రెస్ వే పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరంఘర్ చౌరస్తా 296 పిల్లర్ దగ్గర అదుపు తప్పి కారు బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ప్రమాదం తప్పింది. మెహదీపట్నం నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
రాజేంద్రనగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎక్స్ ప్రెస్ వే మీద ట్రాఫిక్ జాం తలెత్తకుండా రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న కారును క్రేన్ సహాయంతో తొలగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
