
హైదరాబాద్ లోని మెహదీపట్నం పీవీ ఎక్స్ ప్రెస్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లర్ నెంబర్ 36 దగ్గర వేగంగా దూసుకొచ్చిన కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారులో ఉన్న ఇద్దరు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. యువకులను హాస్పిటల్ కు తరలించారు. మోహిదిపట్నం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.