బేగంపేట ఫ్లైఓవర్పైకారు బీభత్సం.. డివైడర్ను ఢీకొట్టి బోల్తా

 బేగంపేట ఫ్లైఓవర్పైకారు బీభత్సం.. డివైడర్ను ఢీకొట్టి బోల్తా
  • నలుగురికి గాయాలు.. డ్రైవర్ పరారీ

పద్మారావునగర్, వెలుగు: బేగంపేట ఫ్లైఓవర్​పై బుధవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓవర్​స్పీడ్​తో డివైడర్​ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. కారును డ్రైవ్ చేసిన వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్​కు తరలించారు. రోడ్డుకు అడ్డంగా కారు బోల్తా పడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో కారును పక్కకు తీసి, ట్రాఫిక్​ను పోలీసులు క్లియర్ చేశారు.