ఔటర్ రింగు రోడ్డుపై కారు బీభత్సం.. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి గాయాలు

ఔటర్ రింగు రోడ్డుపై కారు బీభత్సం.. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి గాయాలు

హైదరాబాద్ : శంషాబాద్ ఔటర్ రింగు రోడ్డుపై కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు బోల్తా కొట్టడంతో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు డాక్టర్లు. రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలంలోని.. పెద్దగోల్కోండ ఔటర్ రింగు రోడ్డుపై గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. మహబూబ్ నగర్ నుండి నల్గోండ వెల్తున్న మారుతి స్వీఫ్ట్ డిజర్ (TS 06 EH 5607) కారు పెద్ద గోల్కోండ వద్దకు రాగానే అదుపు తప్పి డివైడర్ ను డీకొని బోల్తా కొట్టింది.

కారులో మహబుబ్ నగర్, శ్రీనివాస కాలనీకి చెందిన బీటెక్ విద్యార్దులు కార్తిక్, బాలగణేష్ , అచ్యుత్, సాయితేజ, శివ ఉన్నారు. నల్గోండలోని చైతన్య కాలేజిలో సర్టిఫికేట్ లు తీసుకురావడంకోసం భయలుదేరిన వీరు.. శంషాబాద్ పెద్దగోల్కోండ వద్దకు రాగానే ప్రమాదం జరిగిందని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. క్షతగాత్రులను సమీపంలోని ప్రవేటు హస్పటల్ కు తరలించారు.