పొలంలోకి పల్టీకొట్టిన కారు .. ఇద్దరు మృతి

పొలంలోకి పల్టీకొట్టిన కారు .. ఇద్దరు మృతి

గుంటూరు జిల్లా నరసరావు పేట మండలం ఇసప్పాలెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్ ఇద్దరి ప్రాణం తీసింది. ఫాస్ట్ గా వచ్చిన కారు .. అదుపుతప్పి.. రోడ్డుపై నుంచి పల్టీలు కొడుతూ.. పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. కారులో ఉన్న మరికొందరు గాయపడ్డారు.

దేచవరం గ్రామానికి చెందిన కేబుల్ ఆపరేటర్ కొండా వెంకటేశ్వరరెడ్డిగా ఓ మృతుడిని గుర్తించారు. గాయపడిన వారిని స్థానికుల సహాయంతో పోలీసులు దగ్గర్లోని హాస్పిటల్ లో చేర్పించారు.