
కొడిమ్యాల, వెలుగు: రైల్వే గేట్ మెన్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. శనివారం రైలు వస్తుండడంతో జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గంగాధర సమీపంలో గేట్ మెన్ గేట్లు మూసివేశాడు. ఇదే సమయంలో కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్తున్న ఓ కారు గేట్ల మధ్యలో చిక్కుకుంది. రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అప్రమత్తమైన గేట్ మెన్ సిగ్నల్ ద్వారా హెచ్చరించి రైలు నిలిపివేశారు. అనంతరం గేట్లు ఓపెన్ చేసి కారును పంపించడంతో ప్రమాదం తప్పినట్లైంది.