ఏటీఎంకు వచ్చిన వృద్ధుడి కార్డు చోరీ.. రూ.2లక్షలు డ్రా

ఏటీఎంకు వచ్చిన వృద్ధుడి కార్డు చోరీ..  రూ.2లక్షలు డ్రా

వెంకటాపురం వెలుగు: ఏటీఎం నుంచి మనీ తీసిపెట్టమని కోరిన వృద్ధుడి వద్ద ఓ అపరిచత వ్యక్తి కార్టు కొట్టేసి వేర్వేరు చోట్ల డబ్బులు డ్రాచేశాడు. ఈ సంఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో జరిగింది. ఎస్సై జి.తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. మంగళ వీధికి చెందిన కొయ్యల లాలయ్య హెల్త్ డిపార్ట్మెంట్​లో చేసి 2009లో రిటైర్​అయ్యారు. ప్రతినెలా అతనికి రూ.40 వేలు పెన్షన్ వస్తుంది. ఏప్రిల్​20వ తేదీన డబ్బులు తీసేందుకు స్థానిక ఎస్ బీఐ ఏటీఎంకు వెళ్లారు. కంటి చూపు సరిగా లేకపోవడంతో అక్కడికి వచ్చిన ఓ యువకుడిని సాయమడిగాడు. అదే అదనుగా భావించిన యువకుడు వృద్ధుడికి డబ్బులు ఎలా తీయాలో చెబుతూ.. అతని వద్ద ఉన్న కార్డును(కాటమరాయుడు అనే పేరుతో) లాలయ్యకు ఇచ్చాడు.

పిన్​నంబర్ కార్డుతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మే 4న డబ్బుల కోసం లాలయ్య బ్యాంక్​కు  వెళ్లగా అకౌంట్​లో డబ్బులు లేవని తెలిసింది. ఎంక్వైరీ చేయగా ఏటూరునాగారం, వరంగల్, మణుగూరు, పాల్వంచ, ఖమ్మం ప్రాంతాల్లోని ఏటీఎంల నుంచి డబ్బులు తీసినట్లు తెలిసింది. లాలయ్య తన దగ్గర ఉన్న కార్డు చెక్​చేసుకోగా అది అతనిది కాదని తెలిసింది. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి ఫొటోను పోలీసులు గురువారం మీడియాకు రిలీజ్ ​చేశారు. అతని వివరాలు తెలిస్తే పీఎస్ ​నంబర్లు 94407 95394, 99632 55931కి చెప్పాలన్నరు.