
ఘట్కేసర్, వెలుగు: నిర్మానుష్య ప్రదేశంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోచారం ఐటీ కారిడార్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ రాజువర్మ వివరాల ప్రకారం.. పోచారం మున్సిపాలిటీ ఎల్జీ కాలనీ సమీపంలోని బయ్యన్నగుట్ట వద్ద అన్నోజీగూడకు చెందిన చెల్లపు సురేశ్, షేక్ మస్తాన్, కె.బాలాజీ, గుగులోతు సురేశ్, వెల్లపు వెంకటేశ్, కుంచెపు ప్రభుకుమార్ పేకాట ఆడుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి వారిని అరెస్టు చేశారు. 5 సెల్ఫోన్లు, రూ.9,170 స్వాధీనం చేసుకున్నారు.