సినర్‌‌‌‌‌‌‌‌ X అల్కరాజ్‌‌‌‌‌‌‌‌..ఇవాళ మెన్స్ సింగిల్స్​ ఫైనల్

సినర్‌‌‌‌‌‌‌‌ X అల్కరాజ్‌‌‌‌‌‌‌‌..ఇవాళ మెన్స్ సింగిల్స్​ ఫైనల్

ఆదివారం జరిగే మెన్స్ టైటిల్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌లో సినర్‌‌‌‌‌‌‌‌.. డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌ కార్లోస్‌‌‌‌‌‌‌‌ అల్కరాజ్‌‌‌‌‌‌‌‌ (స్పెయిన్‌‌‌‌‌‌‌‌)తో తలపడనున్నాడు. ఒక్క సెట్‌‌‌‌‌‌‌‌ కూడా కోల్పోకుండా ఫైనల్‌‌‌‌‌‌‌‌కు చేరిన సినర్‌‌‌‌‌‌‌‌.. ఎలాగైనా రోలాండ్‌‌‌‌‌‌‌‌ గారోస్‌‌‌‌‌‌‌‌లో తొలి టైటిల్‌‌‌‌‌‌‌‌ గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. 

గత ఆగస్టులో సిన్సినాటి మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ ప్రారంభమైనప్పట్నించి సినర్‌‌‌‌‌‌‌‌ను రెండుసార్లు ఓడించిన అల్కరాజ్‌‌‌‌‌‌‌‌ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనూ ఫేవరెట్‌‌‌‌‌‌‌‌గా దిగుతున్నాడు. 2000 తర్వాత జన్మించిన ఇద్దరు ప్లేయర్లు ఆడుతున్న తొలి మేజర్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌ ఇదే  కావడం విశేషం. 2013 యూఎస్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ తర్వాత మెన్స్‌‌‌‌‌‌‌‌, విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌–2 ప్లేయర్ల మధ్య జరగడం కూడా ఇదే తొలిసారి. 1984 ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ తర్వాత ఏటీపీ, డబ్ల్యూటీఏలో నంబర్‌‌‌‌‌‌‌‌ 1,2 ప్లేయర్ల మధ్య ఫైనల్స్‌‌‌‌‌‌‌‌ జరగడం ఇదే మొదటిసారి.