సముద్రఖని ప్రధాన పాత్రలో రామ్ చక్రి రూపొందించిన చిత్రం ‘కార్మేని సెల్వం’. గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మి ప్రియా, అభినయ కీలక పాత్రలు పోషించారు. అరుణ్ రంగరాజులు నిర్మించారు. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. గురువారం హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సముద్రఖనితో వర్క్ చేసిన తెలుగు డైరెక్టర్స్ ‘విమానం’ ఫేమ్ శివ ప్రసాద్, ‘రామం రాఘవం’ ఫేమ్ ధనరాజ్, ‘సేవ్ ద టైగర్స్’ ఫేమ్ తేజ కాకుమాను అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. సముద్రఖని మాట్లాడుతూ ‘మనం లైఫ్‌ను చూసే విధానాన్ని ఎన్ని రకాలుగా అయినా చెప్పొచ్చు. ఇందులో కూడా డిఫరెంట్‌గా చూపించబోతున్నాం. సినిమా చూసి థియేటర్స్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని ఆలోచింపజేసేలా ఈ చిత్రం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరూ తమ లోన్ ఈఎమ్‌ఐలను కూడా తక్కువ చేసుకోవాలనుకుంటారు. ప్రతి ఒక్కరూ సంపద క్రియేట్ చేసుకుంటేనే గెలుస్తారు అని చెప్పే చిత్రమిది’ అని చెప్పారు. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఈ చిత్రం కనెక్ట్ అవుతుందని దర్శక నిర్మాతలు అన్నారు. నటులు అభినయ, లక్ష్మి ప్రియా, లిరిక్ రైటర్ రాంబాబు గోసాల పాల్గొన్నారు.
