ప్రపంచ విచ్ఛిన్నానికి ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యుద్ధం కారణమవుతోంది: కెనడా ప్రధాన మంత్రి మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్నీ 

ప్రపంచ విచ్ఛిన్నానికి ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యుద్ధం కారణమవుతోంది: కెనడా ప్రధాన మంత్రి మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్నీ 

మెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: అంతర్జాతీయ చట్టాలను, నిబంధనలను గౌరవించకుండా పలు దేశాలు వ్యవహరిస్తున్న తీరు ప్రపంచం విచ్ఛిన్నం అవుతుందనడానికి ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యుద్ధం ఒక ఉదాహరణ అని కెనడా ప్రధాన మంత్రి మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్నీ అన్నారు. భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్యటన ముగించుకొని, ఆస్ట్రేలియా చేరుకున్న కార్నీ.. సిడ్నీలోని లోవీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రసంగించారు. ‘‘అగ్రరాజ్యాలు అంతర్జాతీయ చట్టాలను, నిబంధనలను గౌరవించకుండా వ్యవహరిస్తున్నాయి. దీంతో మిగతా దేశాలు దాని పర్యవసానాలను అనుభవిస్తున్నారు. 

ఈ విచ్ఛిన్నం ఇప్పుడు పశ్చిమాసియాలో కనిపిస్తోంది”అని పేర్కొన్నారు. ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అణ్వాయుధాలు పొందకుండా, అంతర్జాతీయ శాంతి భద్రతలకు ముప్పు కలిగించకుండా చేసే ప్రయత్నాలకు కెనడా మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. మనం కోరుకునే ప్రపంచం కోసం ఎదురుచూడకుండా, ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. ప్రస్తుత ఘర్షణలు అంతర్జాతీయ వ్యవస్థ వైఫల్యానికి మరొక ఉదాహరణగా నిలవడం విచారకరమన్నారు.

మరిన్ని వార్తలు