రాష్ట్రంలో 334కు చేరిన కరోనా కేసులు

రాష్ట్రంలో 334కు చేరిన కరోనా కేసులు

రాష్ట్రంలో మరో 62 పాజిటివ్ కేసులు
మొత్తం 334కు చేరిన బాధితుల సంఖ్య

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా మహమ్మారిలా మారుతోంది. పది రోజుల్లోనే కేసుల సంఖ్య ఐదు రెట్లు పెరిగింది. గడిచిన నాలుగు రోజుల్లోనే ఏకంగా 207 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. గురువారం 27 మందికి, శుక్రవారం 75, శనివారం 43 కేసులు నమోదవగా.. ఆదివారం మరో 62 మందికి వైరస్ ఉన్నట్టు తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ సంఖ్య 334కు చేరింది. ఇందులో 80 శాతానికిపైగా కేసులు ఢిల్లీ మర్కజ్ లింక్ ఉన్నవే కావడం గమనార్హం. వచ్చేవారం రోజుల్లో ఇట్లాంటి కేసులు మరిన్ని బయటపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్‌లోనే అత్యధికం
ఆదివారం వైరస్ పాజిటివ్ వచ్చిన 62 మందిలో 52 మంది హైదరాబాద్‌ జిల్లాకు చెందినవారే ఉన్నారు. శనివారం నాటికి హైదరాబాద్‌లో
యాక్టివ్ కేసులు 93 ఉంటే.. ఆదివారం నాటికి 145కు చేరినట్టు హెల్త్ డిపార్ట్మంట్ బులెటిన్‌లో వెల్లడించింది. హైదరాబాద్ పరిధిలో మరణించిన
ఏడుగురు, డిశ్చార్జి అశ్చార్జి యిన 11 మందితో కలిపితే హైదరాబాద్‌లో కరోనా బారినపడ్డ వారి సంఖ్య 163కు చేరుతోంది. ఇక ఆదివారంనాటి కేసుల్లో ములుగు, వరంగల్ అర్బన్, వికారాబాద్‌ జిల్లాల్లో 2 కేసుల చొప్పున, పెద్దపల్లి, నిర్మల్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.

లెక్కల్లో తప్పులు..
రాష్ట్రంలో హెల్త్ డిపార్ట్మంట్, సీఎంవో నుంచి విడుదలవుతున్న బులెటిన్లు, ప్రెస్ నోట్లలో కరోనా లెక్కల పై గందరగోళం కనిపిస్తోంది. ఇప్పటికే
రెండు, మూడు సార్లు లెక్కలను తగ్గించడం, పెంచడం చేయగా.. ఆదివారం కూడా అలాంటి పరిస్థితి కనిపించింది. రాత్రి పది గంటల తర్వాత
విడుదల చేసిన బులెటిన్‌లో పలు తప్పులు దొర్లాయి . కామారెడ్డిలో నమోదైన కేసుల సంఖ్యను శనివారం పదిగా.. ఆదివారం నాటి బులెటిన్‌లో
ఎనిమిదిగా చూపారు. హైదరాబాద్‌ జిల్లాలో వైరస్ బారినపడి కోలుకున్న వారి సంఖ్యను శనివారం బులెటిన్‌లో పదకొండుగా చూపి.. ఆదివారం
పదికి తగ్గించారు. శనివారం బులెటిన్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 228గా చూపారు. వీటికి ఆదివారం నమోదైన 62 కేసులను కలిపితే 290 కావాలి. కానీ 289గా చూపారు.

తొలి కేసు నుంచి ఐదు వారాలు
రాష్ట్రంలో మార్చి 2న ఫస్ట్ కరోనా కేసునమోదైంది. దుబాయి నుంచి బెంగళూరు మీదుగా హైదరాబాద్‌కు వచ్చిన వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. ఆ వ్యక్తి డిశ్చార్జి‌ అయ్యే వరకు (మార్చి 13 వరకు) ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. మార్చి 14న రెండో కేసు, 15న మరో కేసు నమోదయ్యాయి. తొలి కేసు నమోదై ఆదివారంనాటికి ఐదు వారాలు పూర్తయ్యాయి. ఈ ఐదు వారాల్లో ప్రతి వారం కేసుల సంఖ్య పెరుగుతూ పోయింది. గత పది రోజుల్లో కేసుల సంఖ్య ఐదు రెట్లు పెరిగింది. గత వారం ఏకంగా 267 కేసులు నమోదయ్యాయి.

ఏపీలో ఒక్కరోజే 60..
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 252కు చేరింది. ఆదివారం ఒక్క రోజే 60 కొత్తకేసులు నమోదయ్యాయి. 85 శాతం కేసులు ఢిల్లీ వెళ్లొచ్చినవారు, వారిని కాంటాక్ట్ అయిన వారివేనని వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ లో పేర్కొంది. ఏపీ నుంచి ఢిల్లీకి వెళ్లొచ్చిన 1,085 మందిలో ఇంకా 30 మంది ఆచూకీ లభించలేదు.

For More News..

దేశమంతా వెలిగిన దీపం