రెండు కార్లు డీ: గాల్లో 20 అడుగులు లేచి కింద పడిన ప్రయాణికుడు

రెండు కార్లు డీ: గాల్లో 20 అడుగులు లేచి కింద పడిన ప్రయాణికుడు

ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ప్రమాదాలు చోటుచేసుకోవడం, ఫలితంగా ప్రాణాలు కోల్పోవడం అన్నది నిత్యకృత్యం. ప్రభుత్వాలు, అధికారులు.. ఎన్నిచర్యలు తీసుకున్నా వీటిని మాత్రం అరికట్టలేకపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా రోడ్డు ప్రమాదాల్లో 13 లక్షలమంది ప్రాణాలు కోల్పోతున్నట్లు, ప్రతి మూడు నిమిషాలకో మరణం సంభవిస్తున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. 

అలాంటి రోడ్డు ప్రమాదాల్లో ప్రమాదాల్లో కొన్ని భయంకరమైనవిగా కూడా ఉంటాయి. అంటే ఆ సీన్ చూడగానే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి కోవకు చెందినదే ఇది. రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఒక ప్రయాణికుడిని గాలిలో పక్షిలా తేలియాడుతూ కింద పడ్డాడు. దాదాపు 20 అడుగుల ఎత్తుకే వెళ్లినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఆపోజిట్ డైరెక్షన్‌లో వస్తున్న వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకోట్టినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? అన్నది తెలియరాలేదు. ప్రమాధానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Wear your seatbelt ? pic.twitter.com/7smPiOv1W0

— Vicious Videos (@ViciousVideos) June 16, 2023

ఈ వీడియోను ఇప్పటివరకూ 5.4 మిలియన్ల మంది వీక్షించారు. బాధితుడు సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్లే అంత ఎత్తుకు ఎగిరిపడినట్లు అనుమానిస్తున్నారు. అందువల్ల కార్లలో ప్రయాణించే ప్రతి ఒక్కరూ "సీట్‌బెల్ట్ ధరించండి" అని ఈ  వీడియోలో ద్వారా తెలియజేస్తున్నారు.