హైదరాబాద్, వెలుగు: రియల్ ఎస్టేట్ సంస్థ కాసా గ్రాండ్ హైదరాబాద్‌లో తన విస్తరణను వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా రాజేంద్ర నగర్‌లో కాసాగ్రాండ్ వైబ్ పేరుతో 35 ఎకరాల్లో భారీ నివాస ప్రాజెక్టును ప్రారంభించింది. ప్రస్తుత సంవత్సరంలో ఇది సంస్థకు ఐదో ప్రాజెక్టు. దీనిలో 362 ఐదు బెడ్ రూమ్ల విల్లాలు మాత్రమే ఉంటాయి. ఇందులో 71 శాతం ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఒక్కో విల్లా ధర రూ.3.2 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే నుంచి ఐదు నిమిషాల దూరంలో ఈ ప్రాజెక్టు ఉంది. కొంపల్లి, మియాపూర్ వంటి ప్రాంతాల్లోనూ కాసాగ్రాండ్ ప్రాజెక్టులు చేపట్టింది.
