బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌ పై కేసు నమోదు

బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌ పై కేసు నమోదు

బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్ ఇటీవల ఒంటి పై నూలు పోగు లేకుండా చేసిన ఫొటో షూట్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ముంబయిలోని ఓ ఎన్జీవో చెంబూర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాధు చేసింది. దీంతో నటుడు రణ్ వీర్ పై కేసు నమోదైంది.

ఇటీవల రణ్ వీర్ కు సంబంధించిన న్యూడ్ పిక్స్ పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలు మహిళల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ పలు మహిళలు సైతం ఆరోపించారు. దీంతో ఐపీసీ సెక్షన్ ప్రకారం యాక్ట్‌ 67ఏతో పాటు 292, 293, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. కాగా ఈ టాప్ హీరో ఇలా ఫొటో షూట్‌ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కొందరు రణ్‌వీర్‌కు మద్ధతు నిలిస్తే, మరికొందరు మాత్రం నెగిటివ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.