శిలాఫలకం ధ్వంసం ఘటనలో బీఆర్ఎస్ నేతలపై కేసు

శిలాఫలకం ధ్వంసం ఘటనలో బీఆర్ఎస్ నేతలపై కేసు
  • ఎల్​బీనగర్​లో ముదురుతున్న ప్రొటోకాల్​ వివాదం

ఎల్​బీనగర్, వెలుగు: ఎల్​బీనగర్  సెగ్మెంట్​లో బీఆర్ఎస్, బీజేపీ లీడర్ల మధ్య ప్రొటోకాల్ ​వివాదం ముదురుతోంది. ఇటీవల అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన బీఆర్ఎస్ లీడర్లపై బీజేపీ లీడర్లు ఫిర్యాదు చేయగా వనస్థలిపురం పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. జడ్జెస్ కాలనీ రోడ్ నం.7లోని ఓ పార్కులో 2017లో షటిల్​కోర్టు ఏర్పాటుకు నిధులు మంజూరు కాగా అప్పటి టీఆర్ఎస్​ కార్పొరేటర్ ​కొప్పుల విఠల్​రెడ్డి పేరుతో శిలాఫలకం వేసి పనులు ప్రారంభించారు.

కాంపౌండ్ ​వాల్ ​నిర్మించి కొంత అభివృద్ధి చేశారు. బల్దియా నిధులతో ప్రస్తుత బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి మరింత అభివృద్ధి చేసి ఇటీవల మరో శిలాఫలకం వేశారు. ఇది కాస్తా వివాదస్పదమైంది. శిలాఫలకంలో స్థానిక ఎమ్మెల్యే పేరు లేకపోవడంతో బీఆర్ఎస్ లీడర్లు ధ్వంసం చేశారని, కార్పొరేటర్ నర్సింహను దూషించారని ఆరోపిస్తూ బీజేపీ లీడర్​శ్రీధర్ గౌడ్ బుధవారం వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీపీ ఫుటేజీలను పోలీసులకు చూపించాడు.