
- న్యాయవాది రామారావు ఫిర్యాదు మేరకు నమోదు
కంటోన్మెంట్, వెలుగు: ఇస్లామిక్ స్టేట్ఉగ్రవాద అనుబంధ సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్(ఐసిస్ కే)కు చెందిన పలువురిపై మారేడ్‌పల్లి పోలీసులు దేశద్రోహం, తీవ్రవాద చర్యల కింద కేసు నమోదు చేశారు. ఈ సంస్థ ప్రతినిధులు కొంత కాలంగా వెబ్సైట్ద్వారా మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారు.
మారేడ్‌పల్లికి చెందిన సీనియర్ న్యాయవాది రామారావు ఇమ్మానేని దీన్ని గుర్తించి సైబర్‌క్రైమ్ పోలీసులతో పాటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. అలాగే హైకోర్టులో రిట్‌పిటిషన్ దాఖలు చేయడంతో మారేడుపల్లి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఐసిస్‌కే సంస్థకు చెందిన ఇఫ్తికార్ ఫిర్దోస్, ఇహసానుల్ల టిప్పు మెహసూద్, రిచర్డ్స్వల్లె, ఫకర్ కక్కేల్, నవాబ్ అలీ కటక్, కిరణ్ భట్ తదితరులపై పలు సెక్షన్లపై పోలీసులు ఎఫ్ఐఆర్నమోదు చేశారు. ఉగ్రవాదులకు సంబంధించిన ఇష్యూ కావడంతో కేసును ఢిల్లీకి బదిలీ చేయనున్నట్లు సమాచారం.