
జీడిమెట్ల, వెలుగు: సోషల్ మీడియాలో సీఎం రేవంత్‌రెడ్డిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద పీఆర్వో బండ మల్లేశ్‌పై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లేశ్ రాష్ట్ర సీఎంపై ఫేక్ ఫొటోలతో మీమ్స్ తయారుచేసి ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్నాడని వివేకానందనగర్, గాజులరామారం రోడ్డుకు చెందిన మన్నె దామోదర్ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మల్లేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.