
జూబ్లీహిల్స్, వెలుగు: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. మధ్యప్రదేశ్ ఇండోర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మహమ్మద్ ప్రవక్తపై రాజాసింగ్అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ యూసఫ్ గూడ బడే మజీద్ కు చెందిన ప్రతినిధులు స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. రాజాసింగ్‌పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.