కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు

కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పై కేసు నమోదైంది. ఎన్నికల వేల తనకు నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన పోలీసులను గదిలో వేసి బంధించినట్టుగా పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇందుకు గాను..కొండా విశ్వేశ్వర్ రెడ్డి పై ఐపీసీ సెక్షన్ 332, 342, 506 ల కింద కేసు నమోదు చేశారు.

ఎన్నికల సమయంలో విశ్వేశ్వర్ రెడ్డి సన్నిహితుడైన సందీన్ రెడ్డి ఓటర్లను నగదుతో ప్రభావితం చేసినందుకు అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంతో విశ్వేశ్వర్ రెడ్డికి కూడా నోటీసులు ఇవ్వడానికి వెళ్లగా.. పోలీసులను రూంలో వేసి విశ్వేశ్వర్ రెడ్డి బంధించినట్టుగా కేసు నమోదు అయింది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్  ఎంపీగా పోటి చేసి గెలిచారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో… 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి చేవెళ్ల లోక్ సభ స్థానానికి పోటీచేశారు.