
పెళ్లి చేసుకోవడమే వారు చేసిన తప్పు. యువ జంట వివాహం స్థానిక ఆచారాలకు విరుద్ధం అని పాశవికంగా దాడి చేశారు. వీరి కలయిక సమాజంలో నిషిద్ధం అంటూ ఘోరమైన శిక్షలు వేశారు. అవమానించారు. ఆధునిక యుగంలోకూడా ఇలాంటి ఘటనలు కలవరం చేపుతున్నాయి. ఒడిశాలోని రాయగడ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
అది ఒడిశాలోని రాయగడ జిల్లాలోని కంజామఝిరా గ్రామం.. ఈ గ్రామంలో ఓ యువ జంట స్థానిక ఆచారాలకు విరుద్ధంగా వివాహం చేసుకున్నారని దారుణమైన శిక్షను ఎదుర్కొన్నారు. స్వయాన అత్తకొడుకున్న పెళ్లాడిన యువతికి ఘోర అవమానం, దారుణమైన శిక్ష. అక్కడి సాంప్రదాయ నమ్మకాల ప్రకారం.. వారిది దగ్గర సంబంధంగా భావిస్తారు. వారిద్దరి కలయిక నిషిద్ధం. వివాహం చట్టబద్ధమైనప్పటికీ ఈ సంబంధం తోటి గ్రామస్తుల నుంచి తీవ్ర అభ్యంతరాలను ఎదుర్కొంది. వారు ఈ సంబంధాన్ని ఆమోదయోగ్యం కాని ఆచార ఉల్లంఘనగా భావించారు.
I am writing to express profound concern over a deeply disturbing incident reported in Kanjamajhira village, Rayagada District, Odisha, wherein a young couple was subjected to brutal and humiliating punishment by a mob for marrying in contravention of local societal norms. 1/2 pic.twitter.com/KPDMfUst0z
— sᴀᴘᴀɴᴀ ᴋᴜᴍᴀʀ (@KumarSapan26498) July 11, 2025
ఎద్దుల్లా పొలం తున్నించారు..
ఆచారం ప్రకారం.. వారు చేసింది తప్పు కాబట్టి శిక్ష అనుభవించాల్సిందే అని గ్రామస్థులు అవమానకరమైన దారుణమైన రీతిలో ప్రవర్తించారు. ఆ జంటను బహిరంగంగా అవమానపర్చారు. వారిని వెదురు ,చెక్క దుంగలతో తయారు చేసిన కాడికి కట్టారు. ఇది ఎద్దులు దున్నడానికి ఉపయోగించే కాడి లాంటిది. ఎద్దులా వారితో పొలం దున్నించారు. దీనికి సబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో ఆ యువజంట ఎద్దుల్లా నాగలి లాగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. గ్రామస్తులు అంతా చుట్టూ చేరి వారిని హింసిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ దృశ్యం తాలిబన్ తరహా శిక్షలను పోలి ఉందని , ఇది అమానవీయ రీతిలో ఉందని గ్రామస్తులు ప్రేక్షకుల్లా చూడడం దారుణం అని నెటిజన్లు మండిపడుతున్నారు.
బహిరంగ అవమానం తర్వాత శుద్దీకరణ ఆచారం..
బలవంతంగా పొలం దున్నిన తర్వాత ఆ జంటను గ్రామ మందిరానికి తీసుకెళ్లారు. అక్కడ పెద్దలు వారిచే శుద్ధి కర్మలు చేయించారు. సామాజిక నిబంధనలను ఉల్లంఘించడం ద్వారా ఆ జంట చేసిన 'పాపం'ను శుద్ధి చేయడానికి ఈ చర్యలు తీసుకున్నాం అంటున్నారు గ్రామస్తులు. ఈ శిక్ష వారిని అవమానపరచడమే కాకుండా వారి ధిక్కార తర్వాత వారిని సమాజంలో తిరిగి చేర్చడానికి కూడా ఉద్దేశించబడినవి అని సమర్ధించుకున్నారు గ్రామస్తులు.
ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది.కార్యకర్తలు , పౌర సమాజ సంఘాలు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు . ఇటువంటి అనాగరిక, చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.