
ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టీమిండియా దిగ్గజ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్ ను టార్గెట్ చేశాడు. ఒకే రోజు ఆశ్చర్యకరంగా ద్రవిడ్ రికార్డ్స్ రెండు బ్రేక్ చేశాడు. లార్డ్స్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో కరుణ్ నాయర్ క్యాచ్ పట్టిన రూట్.. ఫీల్డర్ గా టెస్టుల్లో అత్యధిక క్యాచ్ లు పట్టిన ప్లేయర్ గా రికార్డ్ సృష్టించాడు. నిన్నటివరకు ద్రవిడ్ తో సమానంగా ఉన్న ఈ ఇంగ్లీష్ బ్యాటర్.. కరుణ్ నాయర్ క్యాచ్ తో అగ్ర స్థానంలోకి వెళ్ళాడు. జయవర్ధనే (205), స్టీవ్ స్మిత్ (200), జాక్ కల్లిస్ (200),రికీ పాంటింగ్ (196) వరుసగా మూడు, నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నారు.
Joe Root goes clear of Rahul Dravid - the most catches by a fielder in Test cricket 👏 pic.twitter.com/n0FE344ILQ
— ESPNcricinfo (@ESPNcricinfo) July 11, 2025
ఇదే రోజు మరో ద్రవిడ్ రికార్డ్ రూట్ బ్రేక్ చేయడం విశేషం. ఓవర్ నైట్ స్కోర్ 99 పరుగుల వద్ద రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన రూట్.. బుమ్రా వేసిన తొలి బంతికే థర్డ్ మ్యాన్ దిశగా ఫోర్ కొట్టి 192 బంతుల్లో తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. టీమిండియాపై రూట్ కు ఇది 11 వ సెంచరీ కాగా ఓవరాల్ గా టెస్ట్ కెరీర్ లో 37 వ సెంచరీ. ఈ సెంచరీతో రూట్ టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్ కు ముందు వరకు 36 సెంచరీలతో స్మిత్, ద్రవిడ్ లతో సమానంగా ఉన్న రూట్.. లార్డ్స్ లో 100 పరుగులు కొట్టి 37 సెంచరీలతో వీరిని అధిగమించి టాప్-5 లోకి వచ్చేశాడు.
Is there anything Joe Root cannot do? pic.twitter.com/4PdyBaGnLq
— Bazball™️ (@BazballNation) July 11, 2025
156 మ్యాచ్ ల్లో 284 ఇన్నింగ్స్ ల్లో రూట్ ఈ ఘనతను అందుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల లిస్ట్ లో టీమిండియా దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ 51 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. కల్లిస్ (45), పాంటింగ్ (41), సంగక్కర (38) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. తొలి రెండు టెస్టుల్లో పెద్దగా ఆకట్టుకొని రూట్ మూడో టెస్టులో సెంచరీతో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 387 పరుగులకు అలౌట అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ప్రస్తుతం 2 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.
►ALSO READ | IND vs ENG: ఇక మిగిలింది ఇషాంత్ ఒక్కడే: భారత దిగ్గజం కపిల్ దేవ్ 2 రికార్డులు బద్దలుకొట్టిన బుమ్రా