నిజామాబాద్ జిల్లా సిరికొండ రేంజ్ పరిధిలో పెద్ద పులి సంచారం..

నిజామాబాద్ జిల్లా సిరికొండ రేంజ్ పరిధిలో పెద్ద పులి సంచారం..

నిజామాబాద్ జిల్లా సిరికొండ రేంజ్ పరిధిలో పెద్దపులి సంచారం కలకలం రేపింది.శుక్రవారం ( జులై 11 ) తాటిపల్లి ,జనీగ్యాల బిట్ పరిధిలో మల్లం కుంట దగ్గర పులి పాద ముద్రలు గుర్తించిన అధికారులు మగ పెద్దపులిగా నిర్దారించారు. జన్నారం అటవీ ప్రాంతం నుండి కోడిమ్యాల రేంజ్  మీదుగా సిరికొండ రేంజ్ పరిధిలోకి వచ్చినట్లు తెలిపారు అధికారులు.కమ్మర్ పల్లి,సిరికొండ రేంజ్ పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.

పులిని జన్నారం అటవీ ప్రాంతనికీ చెందిన S12 పెద్ద మగ పులిగా గుర్తించారు అధికారులు. పులి ఆనవాళ్లు తెలిసిన వాళ్లు సమాచారం ఇవ్వాలని సూచించిన అటవి శాఖ అధికారులు. ఇదిలా ఉండగా..కొద్దిరోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న పులుల సంచారం కలకలం రేపుతోంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంట పొలాలకు వెళ్ళే రైతులు, కూలీలు వ్యవసాయ పనుల కోసం పంట చేన్లలోకి పోయ్యేందుకు జంకుతున్నారు. 

►ALSO READ | మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. పోలీసుల ఎదుట 22 మంది నక్సలైట్లు లొంగుబాటు

బోథ్ ‌మండలం రఘునాథ్ పూర్ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పులి  ఠీవిగా నడుచుకుంటూ వెళుతుండగా అటుగా వెళుతున్న కొంతమంది యువకులు గమనించారు. పులుల సంచారం గురించి అటవీ అధికారులకు సమాచారం అందించారు.  పెద్ద పులి సంచరిస్తుండటంతో స్థానిక గ్రామాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.