మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. పోలీసుల ఎదుట 22 మంది నక్సలైట్లు లొంగుబాటు

మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. పోలీసుల ఎదుట 22 మంది నక్సలైట్లు లొంగుబాటు

రాయ్‎పూర్: ఆపరేషన్ కగార్‎తో కోలుకోలేని దెబ్బతిన్న మావోయిస్టులకు మరో భారీ షాక్ తగిలింది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. నారాయణపూర్‌ ఎస్పీ ఎదుట నక్సలైట్లు సరెండర్ అయ్యారు. లొంగిపోయిన మావోయిస్టులపై రూ.37 లక్షల రూపాయలు రివార్డ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సరెండర్ అయిన వారిలో కొందరు సెకండ్ కేడర్‎కు చెందిన కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. వరుస ఎన్ కౌంటర్లలో భారీగా ప్రాణ  నష్టం చవిచూస్తోన్న నక్సలైట్లకు.. తాజాగా ఒకేసారి 22 మంది లొంగిపోవడం భారీ ఎదురు దెబ్బనంటున్నారు. 

కాగా, 2026 మార్చి 31 లోపు దేశంలో నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్రంలోని మోడీ సర్కార్ శపథం చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలైన ఛత్తీస్ గఢ్, తెలంగాణ, మహారాష్ట్రలలో భద్రతా దళాలు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య పలుమార్లు ఎన్ కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్లలో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మరణించారు. మావోయిస్టు పార్టీ సుప్రీం లీడర్ నంబాల కేశవరావు, కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, సుధాకర్, భాస్కర్ వంటి కీలక నేతలతో సహా అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. 

►ALSO READ | ఢిల్లీలో మరోసారి భూకంపం.. పరుగులు పెట్టిన జనం