ప్రపంచాన్ని వణికిస్తున్న 10 ప్రాణాంతక వ్యాధులు ఇవే..

ప్రపంచాన్ని వణికిస్తున్న 10 ప్రాణాంతక వ్యాధులు ఇవే..

ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి.వీటిని అదుపు చేయకపోతే తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా జీవనశైలి ఎంపికలతో ముడిపడి ఉన్న వ్యాధుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. 

ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో జనాభా నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం కనబడుతోంది. 2025 నాటికి భారతదేశంలో 1.46 బిలియన్ల మంది నివసిస్తున్నారని ఐక్యరాజ్యసమితి పరిశోధన అంచనా వేసింది. ఈ సంఖ్యతో భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం. దీనికి విరుద్ధంగా జనన రేటు బాగా తగ్గుతోంది. కానీ జనాభా పెరుగుతున్న కొద్దీ ప్రాథమిక సౌకర్యాల కల్పనకు అనేక సవాళ్లను ఎదురవుతున్నాయి. మారుతున్న జీవన శైలితో ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. 

ఈ 10 వ్యాధులను ప్రమాదకరమైనవిగా ప్రకటించిన WHO

జీవనశైలిలో మార్పులు గుండెపోటు దారి తీస్తు్న్నాయి. ఫలితంగా అత్యధిక సంఖ్యలో మరణాలకు సంభవిస్తున్నాయి. ప్రపంచ జనాభాలో అధికభాగం గుండె జబ్బులతో బాధపడుతున్నారు. వ్యాధులతో సంభవిస్తున్న మరణాలకు ప్రధాన కారణాలలో గుండె జబ్బులు ఒకటి అని  ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. గుండెపోటులు ,స్ట్రోకులు గుండె సంబంధిత వ్యాధులు ,ఇస్కీమిక్ గుండె జబ్బులకు ఉదాహరణలు. WHO గణాంకాల ప్రకారం..2021 నుంచి ప్రపంచవ్యాప్తంగా మరణాలకు గుండె జబ్బులు ప్రధాన కారణం. గుండెజబ్బులతో 39 మిలియన్ల మరణాలు సంభవించాయని WHO తెలిపింది. 

రెండవ ప్రమాదం క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) ఆ తరువాత శ్వాసకోశ సంక్రమణ ప్రమాదం, ముఖ్యంగా దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల క్యాన్సర్లు కూడా వేగంగా పెరుగుతున్నాయి. దీనిలో ఎక్కువ మంది ఊపిరితిత్తులు, శ్వాసనాళం,శ్వాసనాళాల క్యాన్సర్లతో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. 

యువతకు డయాబెటిస్.. 

యువత మధుమేహానికి ఎక్కువగా గురవుతున్నారు. సరైన ఆహారపు అలవాట్లు ,జీవనశైలి ఎంపికల కారణంగా  ప్రపంచ జనాభాలో అత్యధిక భాగం మధుమేహం ,ఊబకాయం తో బాధపడుతున్నారు. మానసిక వైకల్యం( డిప్రెషన్ )అల్జీమర్స్ వ్యాధి కూడా సర్వసాధారణం అవుతున్నాయి. క్షయవ్యాధి(TB) ఉన్న రోగులు పదవ స్థానంలో ఉండగా, మూత్రపిండాల వ్యాధులు ఎనిమిదవ స్థానంలో ఉన్నాయి.

క్యాన్సర్ (Cancer)

 శరీరంలోని కణాలు నియంత్రణ లేకుండా పెరుగుతూ గడ్డలుగా మారడం. బ్రెస్ట్, లంగ్, ప్రాస్టేట్, బ్లడ్ క్యాన్సర్ (లుకేమియా) వంటి వివి ధ రకాల క్యాన్సర్లు ప్రపంచ జనాభాను పట్టిపీడిస్తున్నాయి. 
ప్రపంచవ్యాప్తంగా ప్రతి యేటా దాదాపు 10 మిలియన్ మంది క్యాన్సర్ తో చనిపోతున్నారు.జన్యుపరమైన కారణాలు, పొగతాగడం, అల్కహాల్, పొల్యూషన్, ఆహార అలవాట్లతో   ఈ క్యాన్సర్లు వస్తాయని డాక్టర్లు అంటున్నారు 

సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్, టార్గెట్ థెరపీ వంటి వివిధ రకాల చికిత్సలు క్యాన్సర్ వ్యాధుల నివారణకు అందుబాటులో  ఉన్నాయి. 

 హార్ట్ డిసీజెస్ (Cardiovascular Diseases)..

గుండె లేదా రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులను హార్ట్ డెసీజెస్ లేదా గుండె జబ్బులు అంటారు. హార్ట్ అటాక్, స్ట్రోక్, హై బ్లడ్ ప్రెజర్ వంటి వివిధ రకాల గుండె జబ్బులతో ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల ప్రజలు చనిపోతున్నారు. ప్రపంచ మరణాల్లో అత్యధికం గుండె జబ్బులతోనే సంభవిస్తున్నాయి. 

►ALSO READ | మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. పోలీసుల ఎదుట 22 మంది నక్సలైట్లు లొంగుబాటు

అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, అధిక బరువు, స్ట్రెస్ వంటి కారణాలతో గుండెజబ్బులు పెరిగిపోతున్నాయంటున్నారు డాక్టర్లు ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామం, ఆహార నియంత్రణ వంటివి పాటించడం ద్వారా గుండె జబ్బుల బారిన పడకుండా ఉండొచ్చని అంటున్నారు. 

COVID-19..

SARS-CoV-2 వైరస్ వల్ల కలిగే శ్వాస సంబంధిత వ్యాధి ఇది. 2019లో చైనా నుంచి మొదలై ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిగా మారింది. 2020–2023 మధ్యలో దాదాపు 7 మిలియన్లకు పైగా మరణాలు సంభవించాయి. జలుబు, తుమ్ములు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో శ్వాస కోశ వ్యాధులు వస్తాయి. వ్యాక్సినేషన్, మాస్క్, సోషల్ డిస్టెన్స్, శుభ్రత వంటి చర్యల ద్వారా నివారించవచ్చు. 

డయాబెటిస్ (Diabetes)..

డ యాబెటిస్ చాలా రకాలుగా ఉంటుంది. టైప్-1, టైప్-2, గెస్టేషనల్ డయాబెటిస్ రకాలు. ప్రపంచంలో దాదాపు 530 మిలియన్ల మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. అధిక మూత్ర విసర్జన, దాహం, బలహీనత వంటి లక్షణాలు డయాబెటిస్  వచ్చిన వారిలో కనిపిస్తాయి. డయాబెటిస్ నిర్లక్స్యం చేస్తే కిడ్నీ ఫెయిల్యూర్, గుండె జబ్బులు, చూపు కోల్పోవడం వంటివి సంభవించొచ్చు. నియంత్రిత ఆహారం, వ్యాయామం, ఇన్సులిన్/మెడికేషన్ వంటి చర్యలతో డయాబెటిస్ ను కంట్రోల్ చేయొచ్చు 

ట్యూబర్‌క్యులోసిస్ (TB)..

Mycobacterium tuberculosis అనే బ్యాక్టీరియా వల్ల కలిగే టీవీ వ్యాధి వస్తుంది. ప్రతి యేటా దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 10 మిలియన్ కేసులు, 1.5 మిలియన్ మరణాలు సంభవిస్తున్నాయి. జ్వరం, దగ్గు, బరువు తగ్గడం, రాత్రిపూట చెమటలు వంటివి టీబీ లక్షణాలు. 6–9 నెలల పాటు యాంటీ-TB మందులు వాడితే టీబీని దూరం చేయొచ్చు. 

మలేరియా (Malaria),  హెపటైటిస్ B & C,  9. అల్‌జీమర్స్,  ఇబోలా (Ebola Virus Disease) వంటి వ్యాధులు కూడా ప్రాణాంతకమైన వ్యాధులు. వీటి ద్వారా కూడా అధిక మరణాలు సంభవిస్తున్నాయి. 

ఈ వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగానికి పెద్ద సవాలు. అభివృద్ధి చెందిన వైద్యం, టెక్నాలజీ ఉన్నప్పటికీ, ఆరోగ్య సంరక్షణపై అవగాహన, శుభ్రత, ముందస్తు నివారణే ప్రాణాలు రక్షించే మార్గం అని  WHO అధికారులు చెబుతున్నారు.