జనగామ, వెలుగు: జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం బాధ్యతలు స్వీకరిం చారు. 2014 ఐఏఎస్ క్యాడర్ కు చెందిన ఆయన ఇప్పటివరకు కుత్బుల్లాపూర్ జోన్ కమిషనర్ పని చేశారు. తాజాగా బదిలీల్లో జనగామకు కలెక్టర్గా వచ్చారు. ఇక్కడి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గద్వాల జిల్లాకు బదిలీ అయ్యారు. అడిషనల్ కలెక్టర్ పింకేశ్కుమార్ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ వెళ్లారు.
