- రూ.50 వేలు వసూలు.. ఇద్దరిపై కేసు
నేరడిగొండ (ఇచ్చోడ), వెలుగు: పరువు తీస్తామని బెదిరించి ఓ వ్యక్తి నుంచి రూ.1.50 లక్షలు డిమాండ్ చేసి, రూ.50 వేలు వసూలు చేసిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ఎస్ హెచ్ వో నరేశ్ కుమార్ వివరాల ప్రకారం.. మండలంలోని సిరిచెల్మకు చెందిన రాజారపు సందీప్ కు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో పరిచయం ఉంది.
వారి సంబంధం గురించి గ్రామంలో పంచాయతీ పెట్టి బయటపెడతామని, సమస్యను ఇక్కడితోనే పరిష్కరించాలంటే రూ.1.50 లక్షలు ఇవ్వాలని సందీప్‌ను డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. భయాందోళనకు గురైన సందీప్ తన సోదరుడి ద్వారా వారికి రూ.50 వేలు అందజేశాడు. అయినా వారి వేధింపులు ఆగకపోవడంతో అజీం, రవీందర్ పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ హెచ్ వో తెలిపారు.
