ఐపీఎల్–19 లో భాగంగా ఎలిమినేటర్–1 మ్యాచ్ పై ఫైనల్ మ్యాచ్ మీద ఉన్న అంచనాలు నెలకొన్నాయి. ఐపీఎల్ 2026 సెకండ్ హాఫ్ లో అనూహ్యంగా పుంజుకుని టాప్4 లో స్థానం సాధించిన హైదరాబాద్.. ఫైనల్ బెర్త్ కోసం రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. చండీగఢ్ లో జరగనున్న ఈ మ్యాచ్ లో ఓడిపోయిన వాళ్లు ఇంటికే. ఈ తరుణంలో ఎలాగైనా గెలవాలనే కసితో ఇటు SRH, అటు RR వ్యూహాలు రచిస్తున్నాయి.
ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా మ్యాచ్ ప్లాన్ గురించి కొంత క్లూ ఇచ్చారు హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ .ఈ మ్యాచ్ లో సంప్రదాయకంగా ఆడే పరిస్థితి లేదన్నారు. ఏదైతే అదయింది.. ఇవాళ్టి (2026 మే 27) మ్యాచ్ లో దబిడి దిబిడే అంటూ హింట్ ఇచ్చారు. పూర్తిగా అగ్రెస్సివ్ మోడ్ లో ఆడనున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు హైదరాబాద్ కెప్టెన్.
ఫైనల్ కు చేరాలంటే ఎన్నో అంశాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్లాలి. అయితే ఇంఒదులో కొంత ఒత్తిడి, కొంత నర్వస్ ఉన్నప్పటికీ.. వాటిని అధిగమిస్తూ ఆడాల్సిన అవసరం ఉందని అన్నారు. గేమ్ పూర్తయ్యాక ఎలాంటి రిగ్రెట్స్ లేకుండా ఉండేలా ఆడాలని చెప్పుకొచ్చాడు. ఎంత ప్రెజర్ ఉన్నా టీమ్ సాధారణ ఆటను ప్రభావితం చేయకుండా ఆడే ప్రయత్నం చేస్తామన్నారు.
కన్జర్వేటివ్ మోడ్ లో కాకుండా మరింత దూకుడుగా ఆడాలని నిర్ణయించినట్లు చెప్పాడు కమిన్స్. మూడు మ్యాచులు గెలిచిన తర్వాత ఈ స్టేజ్ కు వచ్చినట్లు చెప్పాడు. ఈ టోర్నమెంట్ లో ఒకానొక దశలో ఐదు మ్యాచులు గెలిచినట్లు చెప్పాడు. ఆ ఎక్సీరియెన్స్ .. ఇవాళ్టి మ్యాచ్ లో గెలిచేందుకు ఎంతో తోడ్పడుతుందని అన్నాడు.
- వైభవ్ కోసం మూడు ప్లాన్లు:
రాజస్థాన్ రాయల్స్ సెన్సేషనల్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ కోసం మూడు స్పెషల్ ప్లాన్లు సిద్ధి చేసింది కమిన్స్ సేన. 14 మ్యాచులలో 232 స్ట్రైక్ రేట్ తో 583 రన్స్ చేశాడు సూర్యవంశీ. ఒక బౌలర్ గా బ్యాటర్ ను అర్థం చేసుకుని.. స్ట్రెంత్ ను అర్థం చేసుకుని ఎలా అడ్డుకోవాలో అదే చేస్తామని చెప్పాడు కమిన్స్.
ప్రతీ టీమ్ కు ఒకరు లేదా ఇద్దరు మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్స్ ఉంటారని.. వాళ్లను అడ్డుకోవడమే స్ట్రాటజీ అన్నారు. వైభవ్ కోసం మూడు ప్లాన్ ఉన్నాయని చెప్పిన కమిన్స్.. ప్లాన్ A కాకుంటే.. ప్లాన్ B లేదా ప్లాన్ C ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాడు. లీగ్ దశలో రాజస్థాన్ ను ఇప్పటికే రెండు సార్లు ఓడించిన హైదరాబాద్.. ఎలిమినేటర్ మ్యాచ్ లో అదే సైకాలజీ ప్రకారం.. రాజస్థాన్ పై ప్రెజర్ పెంచుతూ గెలుపు దిశగా దూసుకుపోనున్నట్లు ప్లాన్ చేస్తున్నారు.
