ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి : కలెక్టర్ కె.హరిత

ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం పర్యటన ఏర్పాట్లను  పకడ్బందీగా చేపట్టాలి : కలెక్టర్ కె.హరిత
  • – కలెక్టర్ కె.హరిత

ఆసిఫాబాద్, వెలుగు: జిల్లాలో జూన్ 1న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఆసిఫాబాద్ కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్​లో  ఎస్పీ నితికా పంత్, అడిషనల్ కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, అధికారులతో పర్యటన ఏర్పాట్లపై రివ్యూ నిర్వహించారు. 

కెరమరి మండలం కొత్తగూడలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం, లబ్ధిదారులతో కలిసి భోజనం, ముఖాముఖి కార్యక్రమం ఉన్నందున అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పార్కింగ్, గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని సూచించారు.  సాయంత్రం కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ సమీపంలో బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు.