నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు స్పీడప్ చేయాలి : కలెక్టర్ భవేశ్ మిశ్రా

నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు స్పీడప్ చేయాలి : కలెక్టర్ భవేశ్ మిశ్రా
  •     అధికారులకు కలెక్టర్ల ఆదేశం

నిర్మల్, వెలుగు: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోన్ లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. కేంద్రానికి వచ్చిన ధాన్యం, ఇప్పటివరకు చేపట్టిన కొనుగోళ్లు, తేమ శాతానికి వచ్చి ఇంకా తూకం వేయాల్సిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాంటా వేసిన వడ్లను ఎప్పటికప్పుడు తరలించాలని ఆదేశించారు. 

మామడ మండలం కొరిటికల్ గ్రా మంలోని రైస్ మిల్లులు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను, జాఫ్రాపూర్ లోని రైస్ మిల్లులను తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వస్తున్న ధాన్యం లారీల అన్‌‌లోడింగ్​ను పరిశీలించారు. అవసరమైతే హమాలీల సంఖ్యను పెంచాలని మిల్లర్లను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్, సివిల్​ సప్లై అధికారులు రాజేందర్, సుధాకర్, తహసీల్దార్లు సంతోష్, శ్రీనివాస్,  పాల్గొన్నారు.

వడ్లను వెంటనే మిల్లులకు తరలించాలి

కామారెడ్డి, వెలుగు: అకాల వర్షాల దృష్ట్యా  వడ్ల కొనుగోలు కేంద్రాల నుంచి వడ్లను వెంటనే మిల్లులకు తరలించాలని కామారెడ్డి కలెక్టర్​ఆశిష్​ సంగ్వాన్​ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి మండలం ఉగ్రవాయిలోని మిల్లును, శాబ్ధిపూర్​తోపాటు, సదాశివనగర్​ మండలం అడ్లూర్​ ఎల్లారెడ్డిలో వడ్ల కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాలో అకాల వర్షానికి 1,100 మెట్రిక్​టన్నుల వడ్లు తడిసినట్లు అధికారులు కలెక్టర్​కు వివరించారు.  అడిషనల్ కలెక్టర్​ విక్టర్, డీఎస్​వో వెంకటేశ్వర్లు, డీఎం శ్రీకాంత్, ఇతర అధికారులు ఉన్నారు.