తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘కర’ (KARA). భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 30, 2026న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ నెల రోజుల్లోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకుని, ఇవాళ మే 28 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభించింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మూవీ అందుబాటులో ఉంది.
‘పోర్ తోళిల్’ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన విగ్నేష్ రాజా రూరల్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించాడు. ఇందులో ‘కర స్వామి’ అనే దొంగ పాత్రలో ధనుష్ నటించి ఆకట్టుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మల్లి కోసం దొంగతనాలు మానేసి సాధారణ జీవితం గడపాలని అనుకుంటాడు. కానీ కుటుంబ పరిస్థితులు, తండ్రి మరణం కారణంగా మళ్లీ బ్యాంక్ దొంగతనాల దారిలోకి వెళ్లాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగే బ్యాంక్ దోపిడీలు, వాటి వెనుకున్న కారణాలు కథలో ఉత్కంఠను పెంచుతాయి.
ఈ సినిమాతో ధనుష్ మరోసారి తనేంటో నిరూపించుకున్నారు. ఒక సాధారణ వ్యక్తిగా, భావోద్వేగాల మధ్య నలిగిపోయే తండ్రిగా, మాస్ యాక్షన్ హీరోగా ఆయన నటన అద్భుతం. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో ధనుష్ పండించిన హావభావాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. IMDbలో ‘కర’ 8.1 రేటింగ్ సొంతం చేసుకుంది.
Kara avan oda sathiyathe kaapathuvaan ah? 😧👀 pic.twitter.com/ZjffDamj8M
— Netflix India South (@Netflix_INSouth) May 28, 2026
‘కర’ స్టోరీ:
ఈ సినిమా 1991 నాటి గల్ఫ్ యుద్ధం, అప్పట్లో నెలకొన్న చమురు సంక్షోభం నేపథ్యంలో సాగుతుంది. ఒక గ్రామీణ క్రైమ్ డ్రామాగా మొదలై, హై-వోల్టేజ్ బ్యాంక్ హీస్ట్ (దోపిడీ) థ్రిల్లర్‌గా మారుతుంది. తండ్రి-కొడుకుల మధ్య ఉండే భావోద్వేగ బంధం, ఒక విలక్షణమైన సామాజిక సమస్య చుట్టూ కథ తిరుగుతుంది. ఒక సామాన్యుడు వ్యవస్థపై తిరుగుబాటు చేసి బ్యాంక్ దోపిడీకి ఎందుకు పాల్పడాల్సి వచ్చింది? అందులో ఎదురైన సవాళ్లు ఏమిటి? అనేదే 'కర' ప్రధానాంశం.
