
జూబ్లీహిల్స్, వెలుగు: ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ అయ్యంగర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మంగళవారం శ్రీకాంత్ సోషల్ మీడియాలో జాతిపిత మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గాంధీ మహాత్ముడేమీ కాదని, ఆయన భారత దేశానికి స్వాతంత్ర్యం తీసుకురాలేదని, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి వారి వల్లే స్వాతంత్ర్యం వచ్చిందని కామెంట్లు చేశాడు. దీనిపై దర్శకుడు తల్లాడ శ్రీకాంత్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు ఫైల్ చేశారు.