
- ఓటర్ కార్డుల పంపిణీలో రూల్స్ ఉల్లంఘించారని యాక్షన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్పై కేసు నమోదైంది. మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎలక్టరోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఈఆర్వో) రజినీకాంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు ఫైల్ చేశారు. ఈ నెల 1న నవీన్ యాదవ్ ఓటర్ కార్డులను పంపిణీ చేసినట్లు ఎంపీ రఘనునందన్ రావు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సోమవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఈ నెల 1న ఓటరు కార్డులను పంపిణీ చేసినట్లు గుర్తించారు.
అయితే ఓటరు కార్డులను కోడ్ ఉన్నా, లేకున్నా లీడర్లు పంపణీ చేయొద్దని, చేస్తే వాయిలేషన్ కింద చర్యలు తప్పవని అధికారులు చెబుతున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యగా భావించిన ఎన్నికల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నవీన్ యాదవ్ పై బీఎన్ఎస్ 170, 171, 174తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద సోమవారం సాయంత్రం కేసు నమోదైంది.