
కాగజ్ నగర్, వెలుగు: ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్టింగ్ చేసిన సిర్పూర్ టీ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్చార్జి రావి శ్రీనివాస్‌పై కాగజ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎమ్మెల్యేను కించపరుస్తూ, బెదిరిస్తూ రావి శ్రీనివాస్ బుధవారం సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టినట్లు బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ శివ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టినట్లు టౌన్ ఎస్ఐ చిప్ప సురేశ్ తెలిపారు. ఇదిలాఉండగా రావి శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ చింతలమానేపల్లి మండల నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రావి శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలి
దహెగాం, వెలుగు: ఎమ్మెల్యే హరీశ్ బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రావి శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ దహెగాం మండల అధ్యక్షుడు లగ్గాం దామోదర్ ఆధ్వర్యంలో సింగిల్‌విండో చైర్మన్ కోండ్ర తిరుపతి గౌడ్, నేతలు గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.