టాలీవుడ్ హీరో ధర్మ మహేశ్ భార్య గౌతమి చౌదరిపై కేసు

టాలీవుడ్ హీరో ధర్మ మహేశ్ భార్య గౌతమి చౌదరిపై కేసు

హైదరాబాద్​ సిటీ, వెలుగు: టాలీవుడ్ హీరో ధర్మ మహేశ్​భార్య గౌతమి చౌదరిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌‌‌‌లో సోమవారం బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషా ఫిర్యాదు చేశారు.  దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా శేఖర్​బాషా మాట్లాడారు. హీరో ధర్మ మహేశ్​కు సపోర్ట్ గా మాట్లాడటంతోనే గౌతమి తనను టార్గెట్ చేస్తోందని తెలిపారు.

బిహార్ నుంచి రౌడీలను పంపించి తనను చంపిస్తానని బెదిరిస్తోందని ఆరోపించారు. తన తల్లి, కూతురుపై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందని చెప్పారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌‌‌‌లో గౌతమిపై బీఎన్​ఎస్​351(3),  352 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.