
బాలీవుడ్ ఐటం బాంబ్, పోర్న్ స్టార్ సన్నీ లియోన్‌పై కేసు నమోదైంది. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరవుతానని డబ్బు తీసుకొని హాజరుకాకపోవడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెరుంబవూర్‌కు చెందిన షియాస్ అనే ఈవెంట్ కోఆర్డినేటర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సన్నీ లియోన్‌పై కేసు నమోదు చేశారు. ఆమె 2019 ఫిబ్రవరి 14న ఒక ప్రోగ్రాంతో పాటు మరో మరో నాలుగు ఫంక్షన్లకు హాజరవుతానని ఒప్పుకుంది. అందుకోసం ఆమె మేనేజర్.. ఈవెంట్ మేనేజర్ షియాస్ నుంచి రూ. 29 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. అయితే డబ్బులు తీసుకున్న తర్వాత కూడా ప్రోగ్రాంలకు సన్నీ రాకపోవడంతో ఈ కేసు పెట్టారు. సన్నీ ఈ ప్రోగ్రాంలకు సంబంధించి డేట్లు కూడా ఇచ్చింది. కానీ, ఆమె మేనేజర్ డేట్లు అడ్జెస్ట్ చేయకపోవడంతో ఒప్పుకున్న ప్రోగ్రాంలకు సన్నీ హాజరుకాలేకపోయింది.
ఈవెంట్ మేనేజర్ ఫిర్యాదుతో కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో ఉన్న సన్నీ లియోన్‌ను విచారించారు. ఈవెంట్ మేనేజర్‌ను మోసం చేయాలని భావించలేదని ఆమె తెలిపారు. అయితే ముందస్తు ఒప్పందం ప్రకారం.. డబ్బులు తిరిగి ఇచ్చేదిలేదని ఆమె తెలిపారు. డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనని ఆమె కూడా అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. సన్నీ వాంగ్మూలం మరియు ఈవెంట్ మేనేజర్ నుంచి మరింత సమాచారం సేకరించి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. గత కొన్ని రోజులుగా సన్నీలియోన్ కేరళలో విహారయాత్రలో ఉన్నారు.
For More News..