ముంబై: బిజినెస్‌మన్ అనిల్ అంబానీ, ఆయన సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్(ఆర్.కామ్) పై రూ.1,085 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్‌కు సీబీఐ కేసు నమోదు చేసింది. 2013–17 మధ్య కాలంలో ముంబైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ.621.39 కోట్లు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ప్రస్తుత పీఎన్‌బీ) నుంచి అంబానీ రూ.463.80 కోట్ల రుణాలు తీసుకున్నారు. క్రెడిట్ఫెసిలిటీస్ పొంది ఈ నిధులను ఇతర అవసరాలకు మళ్లించారు. సంబంధిత క్రెడిట్ ఖాతాలు 2017లో ఎన్‌పీఏ(నాన్‌ప్రాఫిట్ అసెట్స్)గా మారాయి.
పీఎన్‌బీ ఫిర్యాదుతో అనిల్ అంబానీతోపాటు ఆర్.కామ్ మాజీ డైరెక్టర్ మంజరి అశోక్ కక్కర్, మరికొందరిపై సీబీఐ అధికారులు కేసు ఫైల్ చేశారు. మరో బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.2,929 కోట్ల మోసానికి సంబంధించి ఫిర్యాదుతో కేసు నమోదైంది. అనిల్ అంబానీ, ఆయన సంస్థలపై వస్తున్న దాదాపు రూ.40 వేల కోట్ల బ్యాంక్ మోసం ఆరోపణలపై విచారణకు సిట్‌ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈడీని ఆదేశించింది.
