హైకోర్టు మాజీ న్యాయమూర్తిపై కోడలి వేధింపుల కేసు 

హైకోర్టు మాజీ న్యాయమూర్తిపై కోడలి వేధింపుల కేసు 

హై కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావు కోడలు తనను శారీరకంగా , మానసికంగా అత్తింటివారు వేధిస్తున్నారంటూ సీసీస్ ఉమెన్స్ పోలీసులను ఆశ్రయించింది. కొంతకాలంగా తనను మానసిక వికలాంగురాలిగా చిత్రీకరించేందుకు తన భర్త నూతి వశిష్ఠ , మామా నూతి రామ్మోహన్ రావు , అత్త నూతి దుర్గ జయలక్షి తనపై దాడి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనపై దాడి తర్వాత హస్పిటల్ లో చికిత్స తీసుకున్నానని… ఇప్పుడు తన ఇద్దరు కూతుళ్లను తనకు ఇవ్వకుండా మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆమె తెలిపింది.

చిన్న కూతురుకి 18 నెలల వయస్సు మాత్రమే ఉందని… పాపకు పాలు కూడా తనే ఇస్తున్నట్లు తెలిపింది. శారీరకంగా , మానసికంగా వేధించిన భర్త , అత్త , మామాపై చర్యలు తీసుకొని… తన పిల్లలను తనకు అప్పగించాలని సింధు శర్మ పోలీసులను వేడుకుంది. ఆమె ఫిర్యాదు మేరకు సీసీస్ పోలీసులు… జస్టిస్ నూతి రామ్మోహన్ రావుతో పాటు అతడి కుమారుడు వశిష్ఠ, భార్య దుర్గ జయ లక్ష్మీలపై వరకట్న వేధింపుల కేసు  498-A, 406,323 IPC, SEC 4 AND 6 OF DP యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.