బండి భగీరథ్ కేసులో సోషల్ మీడియా పోస్టులపై కేసు నమోదు..

బండి భగీరథ్ కేసులో సోషల్ మీడియా పోస్టులపై కేసు నమోదు..

పోక్సో కేసులో పోలీసుల ముందు సరెండర్ అయిన సంగతి తెలిసిందే. బండి భగీరథ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఈ క్రమంలో భగీరథ్ ముందస్తు బెయిల్ విచారణ సందర్భంగా మహిళా జడ్జిపై అనుచిత ఆరోపణలు చేస్తూ పెట్టిన సోషల్ మీడియా పోస్టులపై కేసు నమోదయ్యింది.

విచారణ సందర్భంలోనూ సోషల్ మీడియా పోస్టుల గురించి ప్రస్తావించారు జస్టిస్ మాధవి. ముందస్తు బెయిల్  మంజూరు చేస్తే జస్టిస్ భర్త కు బార్ కౌన్సిల్ చైర్మెన్ పోస్ట్ ఇస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని అన్నారు.

ఈ దుష్ప్రచారాల వల్ల న్యాయ వ్యవస్థ పై ప్రజలకు అపనమ్మకం ఏర్పడుతుందని పేర్కొన్నారు రిజిస్ట్రార్.పలు సోషల్ మీడియా పోస్టులను ఆధారాలుగా చూపిస్తూ చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు హైకోర్టు రిజిస్ట్రార్. రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.