
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదైంది. ఏప్రిల్ 17వ తేదీ శ్రీరామనవమి సందర్భంగా అనుమతి లేకుండా భారీగా భక్తులతో శోభాయాత్ర నిర్వహించారని సుమోటోగా కేసు నమోదు చేశారు పోలీసులు. ర్యాలీ వస్తున్న సమయంలో గౌలిగూడ వద్ద ర్యాలీని నిలిపి బాణాసంచా కాల్చారని పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ర్యాలీని ఆపివేసి భారీ సభను ఉద్దేశించి రాజాసింగ్ ప్రసంగించారని తద్వారా ట్రాఫిక్ జామ్ ఏర్పండిందని పోలీసులు కేసు బుక్ చేశారు. రాజాసింగ్ పై 341, 188, 290,171-c రెడ్ విత్ 34ఐపీసీ సహ పలు సెక్షన్లపై కేససు నమోదు చేశారు పోలీసులు. రాజాసింగ్ తో పాటు జోగేందర్ సింగ్, బిట్టులపై కేసు నమోదు చేశారు.