ఓల్డ్‌సిటీ, వెలుగు : రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నగరంలోని వివిధ హత్య కేసుల్లో నిందితుడుగా ఉండి తప్పించుకొని తిరుగుతున్న రౌడీ షీటర్ మహమ్మద్ ట్రావెజ్ అలియాస్ టబ్బు ను గురువారం అరెస్టు చేసి పీడీ ఆక్ట్పెట్టి, చంచల్‌గూడ జైలుకు తరలించినట్లు సౌత్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే తెలిపారు. మసీయుద్దీన్ హత్య కేసులో రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ సీఐ సీహెచ్ నేతాజీ అమన్ నగర్ బీలోని బావర్చి హోటల్ వద్ద అరెస్టు చేశారు. రౌడీ షీటర్ మహమ్మద్ ట్రాబెజ్ అలియాస్ టబ్బు గతంలో రెయిన్ బజా,ర్ భవానీ నగర్లో రౌడీ షీటర్‌గా దోమల్‌గూడ పీఎస్‌లో హత్యాయత్నం కేసు, రాచకొండలోని ఆదిబట్ల పీఎస్‌లో హత్య కేసులో బహదూర్‌పుర పీఎస్ కేసు ల్లో నిందితుడుగా ఉన్నాడని సౌత్ జోన్ డీసీపీ కిరణ్ తెలిపారు.
