హైదరాబాద్, వెలుగు: హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ కౌన్సిల్‌గా (సీజీసీ) సీనియర్ అడ్వకేట్ ఠాకూర్ వికాస్ సింగ్‌ను కేంద్ర న్యాయ శాఖ నియమించింది. 10 ఏండ్లుగా న్యాయవాది వృత్తిలో ఉన్న ఠాకూర్ వికాస్ సింగ్ 2016లో బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్ అయ్యారు. ఆయన తెలంగాణ హైకోర్టుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ట్రయల్ కోర్టులు, ప్రత్యేక ట్రిబ్యునళ్లలో అడ్వకేట్‌గా ఎన్నో కేసులను వాదించారు.
సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సిల్‌గా, వివిధ పిటిషన్లలో కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రాతినిధ్యం వహించడం, జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై న్యాయ సలహాలు ఇవ్వడం, తెలంగాణ హైకోర్టు ముందు కేంద్ర ప్రభుత్వ విభాగాల తరఫున సమర్థవంతమైన వాదనలు వినిపించే బాధ్యతలను ఠాకూర్ నిర్వహిస్తారు. ఈ నియామకంపై హైకోర్టు అడ్వకేట్లు హర్షం వ్యక్తం చేశారు.
