లాలూ ప్రసాద్ యాదవ్ పై మరో కేసు

లాలూ ప్రసాద్ యాదవ్ పై మరో కేసు

బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పై మరో తాజా కేసు నమోదు చేసింది సీబీఐ. ఈ కేసులో భాగంగా లాలూ నివాసం, ఆయన భార్య,కూతుళ్ల  నివాసాలతో పాలు సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ,బీహార్ లోని దాదాపు 17 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు సీబీఐ అధికారులు. బిహార్ సీఎంగా ఉన్న టైంలో రైల్వే ఉద్యోగాల రిక్రూట్ మెంట్ లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై దర్యాప్తు చేపట్టింది. లాలూ సహా ఆయన కుటుంబ సభ్యులను కూడా ఈ కేసులో నిందితులుగా అభియోగాలు మోపింది సీబీఐ.

లాలుప్రసాద్ యాదవ్ 2004 నుంచి 2009 వరకు  రైల్వే మంత్రిగా ఉన్నారు. దాణా కుంభకోణం కేసులో బెయిల్ పొందిన కొన్ని వారాల వ్యవధిలోనే లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటిపై దాడులు చేపట్టింది సీబీఐ. దాణా కుంభకోణం కేసులో లాలూకు ఐదేళ్ల జైలుతో పాటు రూ. 60 లక్షల జరిమానా విధించింది.