పర్మిషన్ ఇవ్వకున్నా .. డీజే పెట్టిన రిసార్ట్ ఓనర్ పై కేసు

పర్మిషన్ ఇవ్వకున్నా .. డీజే పెట్టిన రిసార్ట్ ఓనర్ పై కేసు

ఘట్ కేసర్, వెలుగు:  పర్మిషన్ ఇవ్వకున్నా.. డీజే, లౌడ్ స్పీకర్లు పెట్టి ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన ఓ రిసార్ట్ ఓనర్ పై కేసు నమోదైంది. ఘట్ కేసర్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన ప్రకారం.. అంకుషాపూర్ లోని విలేజ్ ట్రయల్ రిసార్ట్ ఓనర్  హోలీ సందర్భంగా సోమవారం డీజే తో ఈవెంట్ చేసేందుకు అప్లే చేసుకోగా.. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు పర్మిషన్ నిరాకరించారు.

అయినా.. రిసార్ట్ ఓనర్ రూల్స్ అతిక్రమించి  బ్యాండ్, లౌడ్ స్పీకర్లు, డీజేలు పెట్టి సౌండ్ పొల్యూషన్ కు పాల్పడ్డాడు. ఇబ్బంది కలగడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రిసార్ట్ పై దాడి చేసి డీజే సౌండ్  సామగ్రి సీజ్ చేసి ఓనర్ పై కేసు నమోదు చేశారు.