
హైదరాబాద్/ఖమ్మం, వెలుగు: వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ కుమారుడు ట్రైనీ ఐఏఎస్ మృగేందర్ వివాదంలో చిక్కుకున్నాడు. పెండ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి చేశాడనే యువతి ఫిర్యాదుతో గత నెల 27న కూకట్‌పల్లి పోలీసులు ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేశారు. 376(2)(ఎన్), 420, 417, 506, 406, 201ఐపీసీ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లికి చెందిన యువతికి మృగేందర్ ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యాడు. ప్రేమ పెండ్లి పేరుతో నమ్మించాడు. పలుసార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం మధురైలోని అకాడమీలో ఐఏఎస్‌గా ట్రైనింగ్ పొందుతున్నాడు. యూపీకి చెందిన మరో ట్రైనీ ఐఏఎస్‌తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. బాధిత యువతిని పెండ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో కూకట్‌పల్లి పోలీసులను ఆశ్రయించింది. మృగేందర్‌తో పాటు తండ్రి మదన్‌లాల్ తనను బెదిరిస్తున్నట్లు తెలిపింది.