అమ్మ క్యాంటీన్ ఫ్లెక్సీలను చించేసిన డీఎంకే కార్యకర్తలపై కేసు

V6 Velugu Posted on May 04, 2021

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఘన విజయం సాధించింది. ఆ సంతోషంలో డీఎంకే కార్యకర్తలు కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. చెన్నైలోని ఒక అమ్మ క్యాంటీన్ ఫ్లెక్సీని ఇద్దరు డీఎంకే కార్యకర్తలు చించేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఫిర్యాదు అందడంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న డీఎంకే అధినేత స్టాలిన్ వెంటనే ఆ ఇద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. 

దివంగత జయలలితను తమిళ ప్రజలు అభిమానంగా అమ్మ అని పిలుచుకుంటారు. ఆమె పేరుమీదే పేదలకు భోజనం అందించేందుకు అమ్మ క్యాంటీన్లను అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రారంభించింది. ఈ క్యాంటీన్ల ద్వారా పేదలకు తక్కువ ధరకే ఆహారాన్ని అందిస్తున్నారు.

Tagged DMK activists, remove Amma Canteen Flexi, Case registered

Latest Videos

Subscribe Now

More News