ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై కేసు నమోదు

V6 Velugu Posted on Jul 27, 2021

మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై కేసు నమోదైంది. నిన్న(సోమవారం) యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో రసాభాస జరిగింది. ప్రొటోకాల్‌ ప్రకారం తనకు సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు మంత్రి జగదీశ్‌ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకొని గొడవ చేశారని.. చౌటుప్పల్‌ తహశీల్దార్‌ గిరిధర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో చౌటుప్పల్‌ పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. అయితే ఇలాంటి కేసులకు తాను భయపడబోనన్నారు.

Tagged case registered, Choutuppal, jagadeeshreddy, MLA RajaGopal Reddy, munugodi, raition cards

Latest Videos

Subscribe Now

More News